విదేశాల నుంచి Dell Laptop తెప్పించుకున్నారా ? అయితే తప్పక ఈ పోస్ట్ చదవండి ...

విదేశాల నుంచి Dell Laptop తెప్పించుకోవాలి అని అనుకునేవారికి మరియు ఇంతకు మునుపే తెప్పించుకున్న వారికి Warranty గురించి చాలా సందేహాలు ఉంటాయి . అంటే సాధారణం గా అందరికీ ఉండే సందేహాలు అక్కడ Warranty ఇక్కడ చెల్లుతుందా ? లేదా ?  ఇక్కడ Warranty లోకి మార్పించుకోవాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది . అక్కడ కొన్న Laptop ని మన పేరు మిద ఇక్కడ మార్పించే అవకాశం ఉందా ? ఉంటే ఎంత ఖర్చు అవుతుంది వంటి వగైరా సందేహాలు రావడం ఎవరికైనా చాలా Common . ఈ సందేహాలు అన్నిటికీ ఒక్కొక్కటిగా ఈ Post లో నివృత్తి చేస్కుందాం .
Dell_Warranty_in_Us

Are You Buying New Dell Laptop From Foreign ?

  • మీరు విదేశాల నుంచి Dell Computer తెప్పించుకున్నా ఇక్కడ Warranty చెల్లుతుంది .
  • దీని కోసం మీరు ఒక్క రూపాయి కూడ చెల్లించవలసిన అవసరం లేదు పూర్తి ఉచితం .
  • అలాగే మీరు Warranty Upgrade కోసమో మరింకేదైనా కారణమో Laptop ని విదేశాల నుంచి తెప్పించుకున్నా దానిని మీ పేరు మీదకు మార్చుకోవచ్చు .
  • దీని కోసం Dell Website లో Warranty Owner Ship Transfer System అనేది అందుబాటులో ఉంది దిని లింక్ ఈ పోస్ట్ చివర్లో చూడవచ్చు .
  • దీని కోసం మీరు చేయవలసిందల్లా ఆ లింక్ Open చేస్తే అందులో ఒక ఫాం ఉంటుంది . అందులో Old Owner & New Owner & Laptop Details ని ఇస్తే 15 రోజుల్లో మీ పేరు మీదకు మారిపోతుంది .
  • మీ Laptop వివరాలు పొందటానికి Dell website లోకి వెళ్లి అక్కడ Warranty Information Option వెతికి పట్టుకుని అందులో మీ Laptop Service tag no OR Express Code వివరాలని ఇస్తే మీ Warranty Details చూడవచ్చు .
  • Service Tag Or Express Code వివరాలకు మీ Laptop వెనుకకు తిప్పితే అక్కడ కనిపిస్తుంది .

విదేశాల నుంచి Dell Laptop తెప్పించుకున్నారా ? అయితే తప్పక ఈ పోస్ట్ చదవండి ... విదేశాల నుంచి Dell Laptop తెప్పించుకున్నారా ? అయితే తప్పక ఈ పోస్ట్ చదవండి ... Reviewed by itGuru99 on 12:05:00 PM Rating: 5

కామెంట్‌లు లేవు:

Blogger ఆధారితం.